‘యాత్ర-2’ పేరుతో తనను ‘హీరో’గా, ఉదాత్తమైన లక్షణాలున్న కథా నాయకుడిగా సినిమా తీసిన దర్శకుడు, నిర్మాత మహీ వి.రాఘవకు ముఖ్యమంత్రి జగన్ భారీ ‘పారితోషికం’ అందిస్తున్నారు. తన సొంత సొమ్ము ఎంత సమర్పించుకున్నా ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండేది కాదు. కానీ… ప్రజల ఆస్తిని ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రా ఊటీగా పేరుపొంది, స్వచ్ఛమైన వాతావరణానికి నెలవైన హార్సిలీహిల్స్‌లో రెండెకరాల స్థలాన్ని మహీకి అప్పగిస్తున్నారు. ‘యాత్ర-2’ ఆలోచన మొదలైనప్పుడు దరఖాస్తు వెళ్లింది. సినిమా విడుదలకాగానే భూమి బదిలీకి రంగం సిద్ధమైపోయింది. హార్సిలీహిల్స్‌పై టూరిజం రిసార్టుకు దగ్గర్లోనే రెండెకరాల స్థలాన్ని మహీ వి.రాఘవకు కట్టబెడుతున్నట్టు సమాచారం.