ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది. పెట్రోల్, డీజిల్ కార్ల వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పనపై కంపెనీలు దృష్టిసారించాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో మారుతిలో గ్రాండ్ విటారా, టాయోటాలో ఇన్నొవా హై క్రాస్, అర్బన్ క్రూజర్, హై రైడర్, హోండాలో అమేజ్ ఇతర కార్లపై 100 శాతం రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈవీ కార్లపై రోడ్ ట్యాక్స్ రాయితీ వచ్చే ఏడాది అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. మోడల్ కారును బట్టి రూ.1.80 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది.