పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ప్రభావం కనిపించింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్ పోటీ చేయడంతో పోలింగ్‌లోనూ ఓటర్లు తమదైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈసారి 86.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే 2014లో అయితే 79.44శాతం.. 2019లో 80.92శాతమని లెక్కలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈసారి నమోదు ఎక్కువే. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పిఠాపురం వాసులు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా, టిక్కెట్లు దొరక్కపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గుచూపని వారు సైతం.. ఈసారి హాజరయ్యారు.