అయిదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఒక అనాధలా వదిలేసింది. పోలవరం పేరుతో తెచ్చుకున్న నిధులు ఏమయ్యాయో తెలియదు. మేము ఉన్నాం అంటూ అప్పుడప్పుడు ఇరిగేషన్ మంత్రి, మరో రెండు సార్లు సీఎం జగన్ పోలవరం వెళ్లారు. చూశారు.. కాని చేపట్టవలసిన పనులు ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పరిస్థితిపై దృష్టిపెట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు పోలవరం వెళ్లడం జరిగింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది…. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు అమరావతి సచివాలయంలో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం…కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం పరిశీలనకు రానుంది….నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది….దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది.