చాలా గ్యాప్ తర్వాత రజనీకాంత్ స్టామినా ఏంటో మరోమారు చూయించిన చిత్రం జైలర్ . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 650 కోట్లను కొల్లగొట్టింది. దీంతో కొంతకాలం ఈ సినిమానే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలవగా దీనికి సీక్వల్ కూడా ఉంటుందనేలా వార్తలు బాగానే వినిపించాయి. సోషల్ మీడియాలో బాగా చర్చలు కూడా జరగాయి.అయితే.. ఇప్పుడా వార్తలను నిజం చేస్తూ త్వరలో సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మొదటి చిత్రాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమారే ఈ రెండో చిత్రాన్ని తెరకెక్కించ నుండగా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసినట్లు గుగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా జైలర్ 2 గా వస్తుందనుకుంటున్న హుకూం చిత్రం జైలర్‌కు సీక్వెల్‌గా ఉంటుందా లేక కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.