కారణలు ఇవే అంటున్న సర్వే సంస్థలు!
మనిషి మానసిక ధైర్యం ఎప్పుడు కోల్పోతాడో ఎంతటి బలవంతుడు అయినా గడ్డిపూచకన్నా తేలిక అయిపోతాడు. ఏపీలో వైసీపీకి తిరుగు లేదు.. మరో 30 సంవత్సరాలు జగనే సీఎం.. వై నాట్ 175.. ఇలా గుండెమీద చేయి వేసుకుని చెప్పిన వైసీపీ పరిస్థితి చూస్తే.. సీన్ రివర్స్ అయింది. ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉన్నా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలవడంతో జగన్‌లో కలవరం మొదలైంది. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా.. లోపల అంతర్మధనం చెందుతున్నాడు. ఇంతవరకు అభ్యర్థులకు స్థానాలు కేటాయించినా.. ఆ సీటు తనదే అన్న నమ్మకం ఆ అభ్యర్థికి ఉండడం లేదు. ఎందుకంటే.. జగన్ అభ్యర్థులను ఎప్పటికప్పుడు అటూఇటూ మారుస్తుండడంతో అభ్యర్థుల్లో నమ్మకం కుదరడం లేదు.
ఇదిలా ఉంటే.. సర్వే సంస్థలు ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే లెక్కల చిట్టా విప్పేస్తున్నాయి. ఒక జాతీయ సర్వే సంస్థ ఏబీపీ మరో అడుగు ముందుకు వేసి ఎన్డీఏ కూటమికి 20 ఎంపీ స్థానాలు వస్తాయని, వైసీపీని కేవలం అయిదు స్థానాలకే పరిమితం చేసింది. ముందుగా వైసీపీకే మొగ్గు చూపిన సర్వే సంస్థలు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాయి. ఈ సంస్థలు జగన్‌ను మరింత భయపెడుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీకి సీట్లు తగ్గినా.. ఢీ అంటే ఢీ అన్నట్టు ఫలితాలు ఉంటాయి అని చెప్పుకొచ్చాయి. బీజేపీ కూడా కూటమిలో కలవడం, టీడీపీ ఎన్డీఏలో చేరడంతో రాజకీయ సమీకరణలే మారిపోయాయి. రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. సర్వే సంస్థలు మరో అడుగు ముందుకు వేసి ఎన్డీఏదే విజయం అని తేల్చేశాయి. ఇండియాటుడే, ఏబీపీ, న్యూస్ 18.. ఏ సర్వే గణాంకాలు చూసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే తిరుగులేని విజయమని తేల్చేశాయి. ఎన్డీఏ కూటమి అయితే రాష్ట్రాన్ని పునర్మిర్మాణం చేయగలదని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ఈ విషయాన్ని మీడియా సంస్థల సర్వేలు స్పష్టం చేయడం విశేషం.