ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసులోఅరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుని కోరారు. ఒంటిపై ఉన్న నగలను అనుమతించాలని.. ప్రత్యేకంగా బెడ్, బెడ్ షీట్లు, చెప్పులు, ట్యాబ్లెట్లు ఇవ్వాలని అడిగారు. ఆ వసతులు కల్పించాలని జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో.. తనకు చదువుకునేందుకు కొన్ని పుస్తకాలు కూడా కావాలని కవిత కోరారు. ఆమె అడిగిన జాబితాలో ఓ పుస్తకం గురించి తెలిసి.. లాయర్లు, బీజేపీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆమె అడిగిన పుస్తకమేంటో తెలుసా? బీజేపీ సిద్ధాంతాలకు పునాది అయిన ఆర్ఎస్ఎస్ రచించిన ‘‘21వ శతాబ్ధానికి ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్స్’ ఈ పుస్తకం కావాలని కవిత అడగడంతో చర్చనీయాంశమైంది. వివాదాస్పద అంశాలను ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ ఈ పుస్తకంలో విశ్లేషించారు.