ఈ మధ్య ప్రత్యర్థులను పరుగులు పెట్టిస్తున్న రాహుల్‌ను టార్గెట్ చేశారు. అతనిపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈమధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని.. రకరకాల డీప్‌ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మరో వీడియోని రిలీజ్ చేసి వైరల్ చేయగా.. అది ఫేక్ అని తేలిపోయింది. ఇటీవల నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరు కాని రాహుల్ గాంధీ.. లైవ్ మాత్రం వీక్షించినట్టు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ వ్యతిరేకులు దీన్ని షేర్ చేసి, రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తే, అది ఫేక్ వీడియో అని తేలింది. 2019లో మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏఐ సహకారంతో ఎడిట్ చేసి, మోదీ ప్రమాణస్వీకారాన్ని చూస్తున్నట్టు ఫేక్ వీడియో సృష్టించడం జరిగింది.ి ఇది డీప్‌ఫేక్ వీడియో అని తేలడంతో.. దాని సృష్టికర్తపై నెటిజన్లు మండిపడుతున్నారు.