వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం-03 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఎమ్మెల్యే పిన్నెల్లికి మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం. ఆంధ్ర మూలాలు గల పత్తి వ్యాపారులు పిన్నెల్లికి షెల్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఏపీ పోలీసులకు పిన్నెల్లి ఆచూకీ లభించలేదు.ఒంగోలు జిల్లా పరుచూరుకి చెందిన రామనాథం బాబు అనే సీడ్ పత్తి వ్యాపారి పిన్నెల్లికి షెల్టర్ ఇచ్చినట్లు తెలిసింది. రామనాథం బాబు ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు.