ఇటలీలో ప్రతిష్టాత్మక జీ-7 సభ్యదేశాల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజీ బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు వివిధ దేశాధినేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంబంధాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో నరేంద్రమోదీ భేటీ అయ్యే అవకాశముంది. ఈ సమావేశం కోసం భారత ప్రధాని మోదీతోపాటు జీ-7 సభ్య దేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు భారత రాయబారులు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు విమానాశ్రమంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.