‘రాష్ట్రంలో సర్కారే కల్తీ మద్యం విక్రయిస్తోంది. మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవగ్గీత అని చెప్పిన జగనన్న మద్యపాన నిషేధం చేశాడా? రాష్ట్ర ప్రజలకు అవసరమైన ‘మెగా డీఎస్సీ’, ‘స్పెషల్ స్టేటస్’, ‘కేపిటల్’ తదితర పేర్లను మద్యం బ్రాండ్లకు పెట్టి విక్రయిస్తున్నాడు. వాళ్లు అమ్మిందే కొనాలి, చెప్పిన ధర చెల్లించాలి’ అంటూ శనివారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో నిలదీశారు. రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు ఏం పీకుతున్నారు.. గాడిదలు కాస్తున్నారా? రాష్ట్రానికి బీజేపీ నష్టం చేస్తుంటే ఆందోళన చేసిన పాపాన పోలేదు.జగనన్న ప్రతాపం ఆడబిడ్డలపైనేనా..? సోషల్ మీడియాలోనేనా? అని షర్మిల నిగ్గదీశారు.