ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులూ.. రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారు సరే… అది మీ డ్యూటీ అంటారు. ఒక్కసారైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? అని ప్రశ్నించారు. మీ ఎదురుగా సీఎం జగన్ ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్ను తనిఖీ ఎందుకు చేయలేదని నారా లోకేష్ ప్రశ్నించారు. ‘అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్ ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? సమాధానం డీజీపీ చెబుతారా?’ అని నారా లోకేష్ నిలదీశారు.