జులై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ మహోత్సవం జరగనుంది. ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల్లోని ప్రముఖలందరికి ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ ఆహ్వానించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసర ప్రాంతంలోని హోటల్స్.. తమ రూమ్ ధరలను భారీగా పెంచేశాయి. మరోవైపు అన్ని హోటల్స్‌లోని రూములన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. ముంబైలోని ప్రముఖ హోటల్స్ ట్రైడెంట్, ఒబెరాయి హోటల్స్‌లో రూమ్‌లు ఖాళీ అయితే లేవని సదరు వెబ్సైట్ పేర్కొంది. బీకేసీలోని సోఫిటెల్ హోటల్లో జులై 8 నుంచి జులై 14 వరకు ధరలు ఇలా ఉన్నాయని ఓ వెబ్సైట్ వివరించింది. జులై 8వ తేదీ రూమ్ ధర రూ.13 వేలు ఉంటే.. జులై 13న అదే రూమ్ ధర రూ.30,060గా ఉంది, ఇక జులై 14న రూ. 40,410 ఉందని అధికారిక ట్రావెల్స్ వెబ్సైట్ ధరలతో స్పష్టం చేసింది.