నాయకుడు అంటే ఎలా ఉండాలో ఉండవల్లి రైతులు చూపించారు. రహదారిని పూలపాన్పు గా మార్చారు. చంద్రబాబును ఆ పూలపై నడిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. చంద్రబాబు గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన ఉండవల్లిలోని ఇంటి నుంచి సచివాలయానికి బయలుదేరగా.. దారి పొడవునా అమరావతి రైతులు, మహిళలు పూలవర్షం కురిపించారు. వెలగపూడి దగ్గరున్న వెంకటపాలెం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు పొడవునా వెయ్యి కిలోల పూలతో స్వాగతం పలికి అమరావతికి పూర్వవైభవం వచ్చిందని రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.