గత ఏడాది నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో వారాహి అనే పేరు వార్తలలో ఎక్కువగా వినబడుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ప్రచార వాహనానికి వారాహి అనే పేరు పెట్టడం, ఆ తర్వాత వారాహి అమ్మవారి దీక్ష చేస్తుండటమే దీనికి కారణం. చాలామందికి పవన్ కళ్యాణ్ ద్వారానే వారాహి అమ్మవారి విశిష్ఠత తెలిసిందని చెప్నడంలో సందేహం అక్కర్లేదు. అయితే తాజాగా వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశాఖపట్నంలోని సింహాద్రిపురంలోని ఓ ఇంట్లో తాజాగా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సమయంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా..అమ్మవారు ఆ నీటిని తాగేసింది. ఇది చూసి ఆశ్చర్యపోయారు కుటుంబసభ్యులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది అమ్మవారి మహిమేనంటూ భక్తులు చెబుతున్నారు.