విమానాశ్రయాలు, ఆస్పత్రులు ఇలా అత్యవసర విభాగాల్లో విద్యుత్ ఒక్క క్షణం కూడా పోకూడదు. కాని ఏకంగా అత్యంత రద్దీగా ఉండే ఢల్లీి విమానాశ్రయంలో చీకట్లు కమ్ముకున్నాయి. సుమారు అరగంటపాటు విద్యుత్ లేకపోవడంతో బోర్డింగ్, చెక్ఇన్ సేవలకు అంతరాయం ఏర్పడిరది. ముఖ్యంగా మూడో టెర్మినల్ వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీనీయర్ సిటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సిబ్బంది కనీసం స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో విమానాశ్రయాల్లో వసతులు లేవని, ప్రయాణికులను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.