కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన మరువకముందే.. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఉదంతం కళ్లముందు కదలాడుతుండగానే.. ఇంకో ఉదంతం! పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందిపైగా గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలతోఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అసోంలోని సిల్చార్ నుంచి బెంగాల్ రాజధాని కోల్‌కతాకు వెళ్తున్న కాంచనగంగా ఎక్స్ప్రెసను న్యూజల్పాయ్గురి దాటిన తర్వాత రంగసాని స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు వెనుకనుంచి గట్టిగా ఢీకొట్టింది. గూడ్స్ బోగీలు చెల్లాచెదురయ్యాయి. కాంచనగంగా బోగీలు రెండు పట్టాలు తప్పగా, ఓ బోగి అమాంతం గాల్లోకి లేచింది. రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.