వాలంటీర్లకు ఎన్నికల ముందు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. వాలంటీర్లంతా వైకాపా వారేనని ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురస్కారాల కింద ఏటా ఇస్తున్న మొత్తాన్ని రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే ఆమోదం తెలియజేయనుంది. ప్రతీ సంవత్సరం వాలంటీర్లకు ఇచ్చే సేవా రత్న , వజ్రా వంటి అవార్డులకు ఇచ్చే నగదును రెట్టింపు చేసింది. ఎన్నికల ముందు వాలంటీర్లపై ఎంత ప్రేమో.