ఇక్కడ అందరూ రాళ్లు వేసి మొక్కుకుంటు వెళ్తున్నారు అనుకుంటున్నారా..? ఈ రాళ్లు వేయడానికి మొక్కుకోవడానికి ఒక కారణం ఉంది. ప్రతి ఏటా వీరు ఆ రాళ్ల వద్దకు వెళ్లి బోనాలు సమర్పిస్తారు. పెళ్లి కుదిరితే ముందుగా వెళ్లి నైవేద్యం పెట్టి తర్వాత పెళ్లిలు చేసుకుంటారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్ మొహమ్మద్ పురం గ్రామంలో ఒక ఆచారంఉంది. ఎవరైనా ఇంటి నుండి బయదేరితే వారు ఒక రాయిని వీరుడు పుట్ట దగ్గర వేసి మొక్కుకొని వెళ్తే ఎటువంటి ఆపద రాదు అని ఇక్కడ వారి నమ్మకం. సుమారు తొంబై సంవత్సరాల క్రితం ఎస్ఎం పురం గ్రామానికి చెందిన వ్యక్తి యుద్ధంలో చనిపోతాడు. ఆయన దుస్తులు, వస్తువులు తీసుకొని వచ్చిన ఆ సైనికులు కుటుంబ సభ్యులకు మీ కుమారుడు వీరమరణం పొందాడు అని చెప్పి అతని వస్తువులు అప్పగించి ఆ ఊరు పొలిమేరలో అతని వీరత్వానికి గుర్తుగా ఒక రాయిని పెట్టి అక్కడ గాలిలోకి కాల్పులు జరుపుతారు. అప్పటినుండి ఆ దారి గుండా వెళ్లే ఎవరైనా అక్కడ రాళ్లు వేసి ఆ వీరుడికి మొక్కుకుని వెళ్తే ఎటువంటి ఆపదజరగదని ఈ గ్రామస్తులు నమ్మకం.