కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. త్వరలో భారత్ ‘డోజో’ యాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’లో వెల్లడిరచారు. డోజో అనేది మార్షల్ ఆర్ట్స్ నేర్పే స్కూలు లేదా మైదానం. న్యాయయాత్ర సందర్భంగా రోజూ సాయంత్రం తాను బస చేసిన శిబిరం వద్ద ప్రత్యేకంగా కార్యకర్తలతో కలిసి రాహుల్ జియు-జిత్సు ఆర్ట్‌ను ప్రాక్టీసు చేసేవారు. ఆ వీడియోను గురువారం ఆయన పోస్టు చేశారు. గురువారం (ఆగస్టు 29) జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకున్న ప్రజలతో తన అనుభవాలను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. ‘భారత్ డోజో యాత్ర త్వరలో రాబోతోంది’ అని పేర్కొన్నారు.