ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా నగదునే తీసుకుంటూ డిజిటల్ చెల్లింపులకు ఆస్కారమే లేకుండా చేసేసిన వైకాపా ప్రభుత్వం.. ఎన్నికల తర్వాత ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో స్వీకరించాలని లక్ష్యాల్ని విధించి మరీ విక్రయాలు చేయిస్తోంది. కొన్ని జిల్లాల్లోని దుకాణాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చేపట్టే మద్యం విక్రయాలకు డిజిటల్ చెల్లింపులనే తీసుకోవాలని, మరికొన్ని జిల్లాల్లో 70-80 శాతం లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులే స్వీకరించాలని, సాధ్యమైనంత వరకూ నగదు తీసుకోవద్దని ఆదేశించింది. డిజిటల్ చెల్లింపుల కారణంగా దుకాణాల వద్ద వినియోగదారులతో ఘర్షణలు, వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.