పవన్ పుట్టిన రోజు అంటే అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు.. అందుకు గుర్తుగా సెప్టెంబర్ 2 అంకెతో ఒక లోగోను తయారు చేశారు. ప్రస్తుతం ఈలోగో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. రక్తదానం, ఆసుపత్రులు, పాఠశాలల్లో శ్రమదానం, పేద ప్రజలకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు. తాజాగా ఈ ఏడాది పవన్ బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఇంకేముంది ఇప్పటినుంచే పవన్ ఫ్యాన్స్ ఆ పనుల్లో నిమగ్నమైపోయారు. పుట్టినరోజు ముందే పవన్ కళ్యాణ్‌కు అదిరిపోయే గిఫ్ట్‌లు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను ఈ లోగో సూచిస్తుంది. ఏనుగు, ఏడ్ల బండి, చెట్లు, నీరు ఇలా అన్ని రకాలు ఈలోగోలో ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖను సూచించేలా రైతు ఏడ్ల బండి తోలుతున్న చిత్రం, గ్రామీణాభివృద్ధిని సూచిస్తూ పల్లె వాతావరణం, అటవీ, పర్యావరణ శాఖకు సూచికగా ఏనుగు, సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా ఓ చిహ్నం ఈ లోగోలో కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్‌కు ఆయన అభిమానులు బర్త్‌డేకు ముందే బహుమతిని అందించారంటూ చర్చ జరుగుతోంది.