504 మంది కోటీశ్వరులు ఈసారి ఎంపీలుగా ఎన్నికయ్యారు. మొత్తం లోక్సభలో వీరి సంఖ్య 93 శాతంగా ఉంది. లోక్సభ ఎన్నికలలో ఎంపీలుగా గెలిచే సంపన్నుల సంఖ్య ప్రతిసారీ పెరుగుతోంది. 2009లో 315 మంది, 2014లో 443 మంది, 2019 ఎన్నికలలో 475 మంది కోటీశ్వరులు లోక్సభకు ఎన్నికయ్యారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగింది. వీరిలో బీజేపీ-227, కాంగ్రెస్-92, డీఎంకే-21, తృణమూల్-27, ఎస్పీ-34, జేడీయూ-12, టీడీపీ-16 మంది ఎంపీలున్నారు. కాగా, సంపన్న అభ్యర్థులకు ఇటీవలి ఎన్నికలలో విజయావకాశాలు 19.6 శాతం కాగా, రూ.కోటి కన్నా తక్కువ ఆస్తులు ఉన్న అభ్యర్థులకు కేవలం 0.7 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.