వలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ జరగదని గత వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. కానీ దానిని పటాపంచలు చేస్తూ వారు లేకుండానే పింఛన్లు పంపిణీ చేశామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అపార అనుభవం వల్లే ఇదంతా సాధ్యమైంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక నా క్యాంప్ ఆఫీసుకు మరమ్మతులు చేయించాలని అధికారులు చెప్పారు. వద్దన్నాను. నా కొత్త ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటానన్నాను. ఇటీవల అసెంబ్లీకి వెళ్లినందుకు జీతం వస్తుందని అధికారులు చెబితే… ఇన్ని అప్పులు కనిపిస్తుంటే…తీసుకోవడానికి మనసు అంగీకరించలేదు. వదిలేసుకుంటున్నాన్నా. అంతకుముందు పవన్ రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి నేరుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాసరోడ్డులోని తన నివాసానికి చేరుకున్నారు. నివాసంలోకి వెళ్లే దారిలో గులాబీ పూలతో కార్పెట్లా పరచగా.. దానిపై నడిచేందుకు పవన్ సున్నితంగా తిరస్కరించారు.