విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ . ప్రతీ సోమవారం ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘కన్నప్ప’లోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ.. ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వస్తున్నారు. ఇక రాబోయే కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సోమవారం.. ఓ స్పెషల్ పాత్రకి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. స్పెషల్ పాత్ర అనగానే అంతా ప్రభాస్ అనుకుంటారేమో.. ఎందుకంటే ఇందులో స్పెషల్ రోల్స్ చాలా మంది స్టార్స్ పోషిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయబోతున్నారు. ‘కన్నప్ప’లో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్.. ఈ సినిమాతో మంచు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం మరింత స్పెషల్ కానుంది.