అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీనటి కాదంబరి జెత్వాని పేర్కొంది. తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయి.. అందుకే విజయవాడ వచ్చా. తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నా. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని సినీ నటి జెత్వాని తెలిపింది. . ప్రస్తుత ఏపీ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. అప్పట్లో తనను చిత్రహింసలకు గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తానని వెల్లడిరచింది. విజయవాడ పోలీసులు తనతో మాట్లాడారని.. ఆన్లైన్లో ఫిర్యాదు చేశాననని తెలిపింది. గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు తననొక ఆట బొమ్మలా ఆడుకున్నారని జెత్వాని తెలిపింది. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నా అన్నారు జెత్వాని.