టొరంటోలోని ప్రధాన విమానాశ్రయంలో 36 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భారీచోరికి పాల్పడ్డాడు. భారత్ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కెనడా చరిత్రలోనే భారీ చోరీగా నమోదైంది. సుమారు 400 కిలోల బంగారం బిస్కెట్లు, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది (2023) ఏప్రిల్ 17 22 మిలియన్లకు పైగా కెనడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీని ఉన్న ఎయిర్ కార్గో కంటైనర్‌ని నకిలీ పత్రాలను ఉపయోగించి తస్కరించినట్టు పీల్స్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న సిధూ, పనేసర్లు తమ వద్ద పనిచేశారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి వెల్లడిరచారు