స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేస్తారనగానే మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మూవీని సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి.. జరగండి’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. 150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.