చాలా మంది యువకులు సరదాగా బీర్, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా బీర్ తాగుతుంటారు. ఇదే కోవలో ఓ యువకుడు లిక్కర్ షాపులో బీర్ కొంటుండగా, అతడిని తండ్రి పట్టుకున్నాడు. చెప్పుతో పలుమార్లు కొడుకును కొట్టాడు. అయితే ఆ బీర్లు తనకు కాదని, తన ఫ్రెండ్స్‌కు అని బుకాయించాడు. కాని ఇప్పుడు తండ్రి, కొడుకు, ఇంట్లో కుటుంబ సభ్యులు కలిసి మద్యం సేవిస్తున్న రోజులు.. కాని ఇంకా ఈ తండ్రీకొడుకులు పాతకాలంలో ఉన్నారంటున్నారు నెటిజన్లు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.