గుజరాత్‌లోని కచ్ జిల్లా ఆదిపుర్కు చెందిన కరిష్మా తన అత్యంత అరుదైన కళ్లతో రికార్డులు కొల్లగొడుతున్నారు. 34 ఏళ్ల ఆ యువతి కళ్లతో మాత్రమే కాకుండా మోడల్‌గా, యాంకర్‌గా, నటిగా రాణిస్తూ మన్ననలు పొందుతున్నారు. కంజెనిటల్ హెటెరోక్రోమియా ఇరీడియమ్.. ఇది అత్యంత అరుదైన కంటి వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు ప్రపంచంలో 10మంది మాత్రమే ఉన్నారట. అందులో భారత్‌లో ఉన్నది కరిష్మా మాత్రమే. ఈ వ్యాధి ఉన్న వారికి రెండు కళ్ల రంగు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కారణంగానే కరిష్మా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అరుదైన కళ్లు కలిగిన కరిష్మా 2020లో తొలిసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఇదే కాదు 3 వేలకుపైగా జాతీయ, అంతర్జాతీయ రికార్డులు, పురస్కారాలు సాధించారు. 2010లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న కరిష్మా మోడల్, యాంకర్‌గా రాణించారు. నటిగా పలు టీవీ షోలు, సీరియళ్లు, సినిమాల్లోనూ మెరిశారు.