టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి విషాదాంతం సంగతి తెలిసిందే. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో ఇద్దరు వ్యక్తులతో మరో యాత్రకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలోని ఒహాయోకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానర్.. ఈ సాహస యాత్రను సురక్షితంగా పూర్తిచేయొచ్చని నిరూపించాలనుకుంటున్నారు. ఈసారి ట్రిటాన్ సబ్మెరైన్స్ సహ వ్యవస్థాపకుడు పాట్రిక్ లాహేతో సముద్రంలో 12,400 అడుగుల లోతు వరకు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. సరైనమార్గంలో వెళితే అదొక అద్భుతమని, జీవితాన్ని మార్చేస్తుందని తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ మినీ జలాంతర్గామి రూపకల్పనకు పాట్రిక్ పదేళ్లకు పైగా కష్టపడ్డారు.అయితే వారి ప్రయాణం ఎప్పుడు ఉంటుందో తెలియాల్సి ఉంది.