అల్లరి నరేష్ రీసెంట్గా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. మే 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు సడన్గా డిజల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. చోటాభీమ్ కార్టూన్ నిర్మాత రాజీవ్ చిలక నిర్మించగా మల్లి అంకందర్శకత్వం వహించారు. వయసు మీద పడుతున్నా పెళ్లి కావట్లేదని గణపతి (అల్లరి నరేష్) మ్యాట్రిమోనిని సంప్రదిస్తాడు. ఈ క్రమంలో సిద్ధి (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయితో ప్రేమలో పడిన గణపతి పెళ్లి చేసుకుందామని కోరగా సిద్ధి నిరాకరించి ఆ ఒక్కటీ అడక్కు అని అంటుంది. చివరకు గణపతి అప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అవుతాడు.