విమాన ప్రయాణానికి సిద్ధమైన ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్’ అన్నందుకు విమానం నుంచి దించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్‌ను అందించారు. దీంతో మహిళా అటెండెంట్‌ను పొరపాటుగా పురుషునిగా భావించి.. ‘థాంక్యూ సర్’ అని తెలిపింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ప్రయాణికురాలి తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోగా.. విమానం నుంచి దింపేశారని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.