తాను ప్రేమ పెళ్ళి చేసుకుంటా..తనకు కాబోయే భార్య తన తల్లిదండ్రులనూ ప్రేమించేలా ఉండాలి అంటున్నారు విజయ్ దేవరకొండ . ఆయన నటించిన ‘ఫ్యామిలీస్టార్’ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆ చిత్ర నిర్మాత దిల్ రాజుతో కలసి ఆయన చెన్నైలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ‘పెళ్ళి చేసుకుని భార్యాపిల్లలతో కలిసి జీవించాలన్న ఆశ, కోరిక నాకు కూడా ఉన్నాయి. కానీ, దానికి కొంత సమయం పడుతుంది. అయితే ప్రేమించే పెళ్లి చేసుకుంటా. ఇప్పటివరకు నేను ఎవరినీ ప్రేమించలేదు. ఒక సినిమాలో హీరోయిన్ ఎంపిక దర్శకుడు, నిర్మాత చేతుల్లోనే ఉంటుంది. హీరోకు సంబంధం ఉండదు. రాజకీయాల్లో వచ్చే స్థాయికి ఇంకా ఎదగలేదు. చిత్రపరిశ్రమలోనే ఇంకా పైస్థాయికి రావాలన్నదే నా కోరిక అంటున్నారు దేవరకొండ.