కొంగలు నదులు, చెరువుల్లో చేపలను ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. కొన్ని కొంగలు ఒంటి కాలిపై కదలకుండా నిలబడి.. సమీపానికి వచ్చే చేపలను ఇట్టే నోట కరచుకుంటుంటాయి. అయితే ఇలాంటి కొంగలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటంది. మీ ఊహకు కూడా అందడం లేదు కదా. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కొంగ ఇలాగే చేసింది. ఓ చేప చెరువు ఒడ్డున పడి కొట్టుమిట్టాడుతుంటుంది. నీటిలోకి వెళ్లే వీలు లేకపోవడంతో చాలా సేపు గిలగిలాకొట్టుకుంటూ ఉంటుంది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న కొంగ.. చేపను గమనించి మెల్లగా చేప వద్దకు వెళ్తుంది. చటుక్కున నోట్లో వేసుకుని మింగేస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ ఆ కొంగ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.కొట్టుమిట్టాడుతున్న చేపను నోట కరుచుకుని మళ్లీ నీటిలో పడేస్తుంది. ఇలా ఈ చేపను చూడగానే తన మంచితనం చూపించింది. దీనిపై నెటిజన్లు ‘‘ఈ కొంగది ఎంత మంచి మనసు’’… అంటూ కామెంట్లు చేస్తున్నారు.