టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టు ఊరట కల్పించింది. చీటింగ్ కేసులో అతన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేసింది. జస్టిస్ మహమ్మద్ నియాస్ సీపీ ఈ ఆదేశాల్ని జారీ చేశారు. చీటింగ్ కేసులో విషయంలో రెండు పార్టీల మధ్య సెటిల్మెంట్ జరిగిందని జస్టిస్ తెలిపారు. డిసెంబర్ 8వ తేదీన మళ్లీ ఈ కేసులో తుది విచారణ జరగనున్నది. ఈ కేసులో తనను తప్పుగా ఇరికించినట్లు యాంటిసిపేటరీ బెయిల్‌ను శ్రీశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు.
కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన సారీశ్ గోపాలన్ అనే వ్యక్తి చీటింగ్ కేసును ఫైల్ చేశాడు. చూండాకు చెందిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఏప్రిల్ 25, 2019 నుంచి రాజీవ్ కుమార్, వెంకటేశ్ కిని అనే ఇద్దరు వ్యక్తులు తన వద్ద సుమారు 18.70 లక్షలు తీసుకున్నారని, కర్నాటకలోని కొల్లూరులో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు వాళ్లు చెప్పారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. అయితే ఆ అకాడమీలో శ్రీశాంత్ పార్ట్నర్గా ఉన్నాడు. అకాడమీలో భాగస్వామ్యం ఇస్తారని చెప్పడం వల్లే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపాడు. ఐపీసీ 420 సెక్షన్ కింద శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు బుక్ చేశారు.
చీటింగ్ కేసులోశ్రీశాంత్కు బెయిల్.
Leave a comment
Leave a comment