ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడిరచి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు ఏప్రిల్ 9 వరకూ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అయితే కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘ఇది తప్పుడు కేసు, పొలిటికల్ లాండరింగ్ కేసు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇప్పటికే ఒక నిందితుడు భాజపాలో చేరాడు. మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇస్తోంది. మూడో నిందితుడు రూ.50 కోట్లు బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు కవిత.