ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో గూగుల్ పేను అనేక మంది వినియోగిస్తున్నారు. ఇది మరికొన్ని రోజుల్లో బంద్ కానుంది. అవును ఇది నిజమే. జూన్ 4, 2024 నాటికి ఇది షట్డౌన్ చేయబడుతుందని తెలిపింది. కానీ దీని సేవలు భారత్లో కాదు అమెరికాలో నిలిపివేయనున్నారు. అమెరికాలో 2022లో వచ్చిన తర్వాతయాప్ వాడకం తగ్గిపోయింది.ఆ క్రమంలో ప్రతి వినియోగదారుడికి మొదటి ఎంపికగా గూగుల్ వ్యాలెట్ మారింది. దీంతో అమెరికాలో పాత యాప్ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు దాని పాత వెర్షన్ పనిచేయదు. అయితే భారతదేశం, సింగపూర్ వినియోగదారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ ప్రకటించింది.