ప్రతిరోజూ ఖరీదైన బట్టలు వేసుకుని, బైక్‌లు, కార్లలో ఆఫీస్‌లకు వెళ్లే కార్పొరేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ను చూసి చాలా మంది ఈర్ష్య పడుతుంటారు. వారి సంపాదన గురించి తెలుసుకుని షాకవుతుంటారు. అయితే అలాంటి కార్పొరేట్ ఉద్యోగులకే షాకిచ్చాడు ఓ పానీ పూరి వ్యాపారి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఉద్యోగిని ఓ సాధారణ పానీపూరీ అమ్మే వ్యక్తితో మాట్లాడిరది. దానికి ఆ వ్యక్తి స్పందిస్తూ. నెలకు రూ.70 వేల వరకు సంపాదిస్తా అనడంతో ఆ యువతి షాకై కళ్లు తేలేసింది . నెలకు రూ.70 వేలు అంటే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ జీతంతో దాదాపు సమానం అనే చెప్పాలి. పైగా ఎలాంటి ట్యాక్సులూ కట్టనసవరం లేకుండా సంపాదన మొత్తం జేబులోకి చేరుతుంది.