రూ. 11 కోట్ల విలువ చేసే 16.67 కేజీల బంగారంతో పాటు 39.73 కేజీల వెండిని డీఆర్ఐ అధికారులు పట్టేశారు. ఢల్లీి అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్‌లో హాంకాంగ్ నుంచి ఢల్లీికి వచ్చిన ఓ పార్శిల్లో బంగారం, వెండిని గుర్తించారు. ఎలక్ట్రిక్ మీటర్లలో బంగారంతో పాటు వెండి దాచి ఢల్లీికి కేటుగాళ్లు పార్శిల్ పంపించారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎలక్ట్రిక్ మీటర్ల పై భాగంలో బంగారంతో పాటు వెండి కోటింగ్ చేసి పైన నల్లటి పెయింట్‌ను స్మగ్లర్స్ రుద్దారు. ఢల్లీి అంతర్జాతీయ ఫోస్ట్ ఆఫీసులో డీఆర్ఐ మాటు వేసి పట్టేశారు. పార్శిల్‌పై ఉన్న అడ్రస్ ప్రకారం స్మగ్లర్స్ వేటలో డీఆర్ఐ అధికారులు పడ్డారు.