అటు ఆటతోనూ, ఇటు అందంతోనూ యువకుల హృదయాలను కొల్లగొడుతుంది టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన . తాజాగా ఆమెకు సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్టు చూసి ఆ యువ హృదయాలు ముక్కలయ్యాయి. మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ తో ఉన్న ఆమె బంధం అఫీషియల్ కావడమే అందుకు కారణం. తమ ఐదేళ్ల రిలేషన్‌షిప్‌కు గుర్తుగా స్మృతితో కలిసి కేక్ కట్ చేస్తోన్న ఫొటోలను అతడు షేర్ చేశాడు. ఆ పోస్టుకు ఈ బ్యాటర్ కూడా స్పందించారు. ఇక ఆ ఫొటోలను చూడగానే నెటిజన్లు ‘క్యూట్’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ కొద్దికాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఐదేళ్ల బంధాన్ని బయటపెట్టారు. 29 ఏళ్ల పలాశ్ ఒక మ్యూజిక్ కంపోజర్. టీ సిరీస్, జీ మ్యూజిక్, పాల్ మ్యూజిక్ కోసం పలు మ్యూజిక్ వీడియోలు చేశాడు. అలాగే వెబ్‌సిరీస్ రిక్షా, అర్ధ్(సినిమా)కు దర్శకత్వం కూడా వహించాడు. అతడి సోదరి పలక్ ముచ్చల్ కూడా బాలీవుడ్లో సింగర్‌గా రాణిస్తున్నారు.