ఖతర్ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌కు వెళ్తున్న ఖతర్ ఎయిర్వేస్ విమానమొకటి తుర్కియే గగనతలంలో ఆదివారం తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురు ప్రయాణికులు కాగా, మిగతా ఆరుగురు విమాన సిబ్బంది. విమానం షెడ్యూలు ప్రకారం సురక్షితంగా ల్యాండయిందని, గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నామని డబ్లిన్ విమానాశ్రయం ఓ ప్రకటనలో వెల్లడిరచింది. లండన్ నుంచి బయలుదేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానమొకటి ఇటీవల తీవ్ర కుదుపులకు లోనుకావడంతో బ్రిటిష్ ప్రయాణికుడొకరు గుండెపోటు బారినపడి మృతిచెందిన సంగతి గమనార్హం.