పులస చేప పేరు గోదావరి జిల్లాల వారికి కొత్త ఏమీ కాదు.. కాని దేశ ప్రజలకు పులస చేప ప్రత్యేకం.. స్టార్ హోటల్స్‌లో పులస చేప కర్రీ అంటే వేల రూపాయలు చెల్లించాల్సిందే. అదేమిటో చూద్దాం.. గోదావరికి వరదనీరు వచ్చిందంటే పులస చేపల సందడి మొదలవుతుంది. ఈ చేప ఎప్పుడొస్తుందా అని భోజనప్రియులు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తుండటంతో పులస చేప వలకు చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక గంగపుత్రుల వలలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప పడిరది. 24 వేలు పెట్టి పోటీపడి పులసను కొనుగోలు చేశారట.