అదృష్టవంతుడుని ఆపలేం.. దురదృష్టవంతుడిని బాగుచేయలేం అన్న దానికి ఈ ఎన్నికలే ఉదాహరణ.. ఒక సాధారణ కార్యకర్త, పార్టీలో చేరి మూడు నెలలే.. అయినా ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. మంత్రి కూడా అయ్యాడు. అదృష్టం అంటే ఇలా ఉండాలి. అతను ఎవరో చూద్దాం.. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ మూడు నెలల కిందట మండపేట ప్రచారానికి వచ్చిన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాడు. అనూహ్యంగా రామచంద్రపురం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది. సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో సుభాష్ను పదవి వరించింది. చంద్రబాబు మంత్రివర్గంలో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.