నిరుద్యోగ సమస్యలపై ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన క్రమంలో షర్మిల జగన్ పాలనపై నిప్పులు కురిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతో జగన్ పాలనను పోల్చి మరీ ఏకి పారేస్తున్నారు. చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని షర్మిల ఎద్దేవ చేశారు. ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా చంద్రబాబు కన్నా జగన్ పాలన అధ్వానం. సచివాలయాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు లెక్కలు చూపి ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి సిగ్గుండాలని షర్మిల ఫైర్ అయ్యారు. ఛలో సెక్రటేరియట్‌కు శాంతియుత మార్గంలోనే సెక్రటేరియట్‌కు వెళతామని షర్మిల పేర్కొన్నారు.