నలభై రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడో యువకుడు. మరో రెండు సార్లు పాము తనను కాటు వేస్తుందని తెలిపాడు. 9వసారి కాటు వేసిన తర్వాత ఎవరూ కాపాడలేరని చెప్పడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే అనే యువకుణ్ని 40 రోజుల వ్యవధిలోనే వేర్వేరు పాములు ఏడుసార్లు కాటు వేశాయి. ప్రస్తుతం వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల వికాస్ ఆశ్చర్యపోయే విషయం బయటపెట్టాడు. తనకు వచ్చిన ఓ కల గురించి కుటుంబసభ్యులకు చెప్పాడు. తనను కలలో ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని కల వచ్చినట్లు వికాస్ వివరించాడు. వికాస్‌నే పాములు ఎందుకు కాటు వేస్తున్నాయో అర్థం కావడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.