మధ్యప్రదేశ్‌లో ఓ దిగ్భ్రాంతికర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫోన్లో మహిళా లెక్చరర్‌గా నమ్మించి.. స్కాలర్షిప్ పని పేరిట విద్యార్థినులను పిలిపించి, వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థినులపై ఇలా దారుణానికి ఒడిగట్టినట్లు తెలియవచ్చింది. బాధితుల్లో చాలామంది గిరిజనులే ఉన్నట్లు సమాచారం. సీధీ జిల్లాకు చెందిన బ్రజేశ్ ప్రజాపతి (30).. యాప్ సాయంతో ఓ కళాశాల మహిళా లెక్చరర్‌గా గొంతు మార్చి, స్కాలర్షిప్ పని ఉందంటూ విద్యార్థినులకు ఫోన్ చేసేవాడు.అది నిజమని నమ్మి వచ్చిన బాలికలను తన బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం వారి వద్ద నుంచి ఫోన్ లాక్కొని పరారయ్యేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు మే 16న తొలి కేసు, అనంతరం మరో మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.