మాములుగా సినిమా సెట్లు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. దాంతో చాలా మంది మేకర్స్ అవసరమైతే మాత్రమే సెట్లను వేయిస్తుంటారు. లేదంటే గ్రాఫిక్స్‌తో పని కానిచ్చేస్తుంటారు.అయితే ఒక దర్శకుడు కేవలం 2 సెకన్ల సీన్ కోసం ఏకంగా రూ.8 కోట్ల సెట్‌ను వేయించాడు. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా..? అదే ‘భారతీయుడు-2’. ఈ మధ్య కాలంలో ఈ సినిమాపై వచ్చినంత నెగిటివీటీ, ట్రోల్స్ ఏ సినిమాకు రాలేదు. మాములుగానే శంకర్ సినిమాలతో తమిళంలో ఎంత క్రేజ్ ఉంటుందో.. తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటిది భారతీయుడు 2ను ఒక్కసారి కూడా చూడలేకపోయామంటే శంకర్ నుంచి ఎలాంటి సినిమా వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం ఏకంగా రూ.8 కోట్లు నిర్మాతతో ఖర్చు చేయించాడు. అది కూడా కేవలం 2 సెకండ్లు మాత్రమే ఉంటుంది.ఈ సినిమాలో విలన్‌గా నటించిన ఎస్.జే సూర్య ఉండే ఇల్లును ప్రత్యేకంగా తీర్చిదిద్దారట. ఇందు కోసం ఏకంగా రూ.8 కోట్లు ఖర్చయిందట. తీరా చూస్తే.. సినిమాలో ఈ ఇల్లు కనిపించేది కేవలం 2 సెకండ్లు మాత్రమే. ఒక్క ఇల్లు సెట్ కోసం రూ.8 కోట్లు అంటే మామ్నులు విషయం కాదు.