వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చివరకు అధినాయకుడు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీలో పవన్‌కల్యాణ్‌తోపాటు జనసైనికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అధికారం కూటమికి వచ్చింది. అందరూ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన వేళ.. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, పురందేశ్వరి వారి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హితబోధ చేశారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దు.. అని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో అధికారం సాధించినా ఎవరూ వైసీపీ నేతలపై ఎటువంటి దాడులకు పాల్పడ లేదనే చెప్పవచ్చు. కాని టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు ఉదాహరణే కంచికచర్లలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఫ్లెక్సీలు చించివేశారు. ఇది ఖచ్చితంగా వైసీపీ నేతలదే అంటున్నారు టీడీపీ నేతలు.