ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రేమికుల ప్రవర్తన అందరికీ ఆగ్రహం తెప్పించేలా ఉంటున్నాయి. పార్కులు, రోడ్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు.. ఇలా ప్రదేశం ఏదైనా వారి ప్రవర్తన మాత్రం ఒకేలా ఉంటోంది. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తున్నాం. తాజాగా, రైలు బోగీలపై ప్రేమికుల నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట వెరైటీగా రైలు బోగీలపై పార్కు తరహాలో నడిచి అంతా అవాక్కయ్యేలా చేశారు. ఓ రైలు ప్లాట్‌ఫామ్‌పై నిలబడి ఉండగా.. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్క్‌లో ఎలాగైతే వాకింగ్ చేస్తారో.. అచ్చం అలాగే వీరిద్దరూ రైలు బోగీలపై ఓ వైపు నుంచి మరో వైపునకు నడుస్తూ వెళ్లారు. వీరిని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలా ఆ ప్రేమ జంట చాలా సేపు రైలు బోగీలపైనే గడిపింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటు చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇది రైలు అనుకున్నారా.. పార్కు అనుకున్నారా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.